వాస్తుశాస్త్రం ప్రకారం కూడా మనీ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. డబ్బు, శ్రేయస్సును అగ్రస్థానంలో ఉంచడానికి ఇంట్లో మనీ ప్లాంట్లను ఎలా ఉంచుకోవాలో చూద్దాం.
మనీ ప్లాంట్‌కు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉందని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతారు. ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని అంటారు. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని నమ్మకం.
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అది నేలను ఏ విధంగానూ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ భూమిని తాకితే అది శ్రేయస్సు పరంగా మంచిది కాదని అంటారు.
మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. ఒకవేళ ఎండితే వెంటనే తొలగించాలి. మనీ ప్లాంట్ పాదును ఎప్పుడూ పైకే పాకించాలి. మనీ ప్లాంట్‌ను నేలపై కాకుండా కుండీలోనే పెంచాలి.
ఎర్రటి వస్తువులను మనీప్లాంట్ దగ్గర ఉంచడం సరికాదు. బ్లూ టబ్ లో ఉంచాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. మనీప్లాంట్‌ను పాదాల దగ్గర కాకుండా తల దగ్గర ఉండేలా చూసుకోవాలి.
మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. ఒకవేళ ఎండితే వెంటనే తొలగించాలి. మనీ ప్లాంట్ పాదును ఎప్పుడూ పైకే పాకించాలి. మనీ ప్లాంట్‌ను నేలపై కాకుండా కుండీలోనే పెంచాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్‌ను పొరపాటున కూడా ఈశాన్య దిశలో ఉంచకూడదు. దీనివల్ల నష్టాలు ఎదురౌతాయి. శుక్ర గ్రహంతో సంబంధం ఉన్న మనీ ప్లాంట్‌ను శుక్రవారం నాడు నాటాలి.
ఇంటి ఈశాన్య మూలలో అస్సలు ఉంచకూడదు. వినాయకుని తూర్పు దిక్కు కాబట్టి ఆ దిశలో మొక్కను ఉంచడం శుభప్రదమని పలువురు పండితులు చెబుతున్నారు.