వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు నిర్ధేశించిన దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం నలుదిక్కులను అనుసరించి వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు.
ఈశాన్య దిశలో ఒక్క వస్తువును ఏర్పాటు చేసుకుంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ దిశలో శంఖం ఏర్పాటు చేసుకుంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. శంఖం అంటే శ్రీ మహా విష్ణువుకు ప్రతీక.
సాధారణంగా ఈశాన్య దిశలో పూజగది ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే శంఖం కూడా ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి.. ఇది మనకు మేధస్సును కూడా అందిస్తుంది.
ఈశాన్య దిశలో శంఖం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో నెగిటివిటీ తగ్గిపోయి, సానుకూల శక్తి వస్తుంది. శంఖాన్ని ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈశాన్య దిశ అంటేనే సంపదకు చిహ్నం. ఈ దిశలో ఏర్పాటు చేసిన శంఖం ఊదడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
అంతేకాదు వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని అంటారు. ఎందుకంటే ఈ దిశలో పూజలు చేస్తాం. ఈ దిశలో పరిశుభ్రంగా ఉంటే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి.
సాక్షాత్తు ఆ ఈశ్వరుడే ఈశాన్య దిక్కుకి అధిపతిగా ఉండి ఇంట్లోని వారిని సదా రక్షిస్తూ ఉంటాడు. ఈశాన్య దిక్కులో వాస్తు పురుషుని శిరస్సు ఉంటుందని చెబుతారు. ఈశాన్యం లేని స్థలం ప్రాణం లేని శరీరం వంటిది.