ఈ విధంగా చేయండి చాలు.. చిటికెలో ఒత్తిడి దూరం.. 

29 September 2025

Prudvi Battula 

రోజువారీ జీవితంలో పని ఒత్తిడి వల్ల తలనొప్పి, వెన్నునొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు.

ఒత్తిడి కారణం రోగనిరోధక శక్తి బలహీన పడటంతో పాటు ఇప్పటీకే ఉన్న జబ్బులుంటే తీవ్రమవుతాయనిఆ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కాబట్టి ఒత్తిడికి గురైతే మాత్రం వెంటనే తగ్గించుకోవాలి. ఇది తగ్గించడం కోసం ఓ పద్దతి పాటిస్తే చిటికెలో ఒత్తిడి దూరం చేయవచ్చు.

నిమిషం పాటు గాఢంగా శ్వాస తీసుకోవటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లబిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి సమస్యను నివారించుకోవచ్చు.

ముందుగా ప్రశాంతంగా కూర్చొని లేదా పడుకొని ఛాతీపై ఒక అరచేతిని.. అలాగే కడుపుపై మరొక అరచేతిని పెట్టుకోండి.

నెమ్మదిగా గాఢంగా శ్వాస తీసుకుంటూ కడుపును మీదుండే చేతిని కడుపు నెడుతుండాలి. ఛాతీ మీది చేయి మాత్రం అలాగే ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలేయాలి.

ఒత్తిడి ఉన్నప్పుడు ఇలా ఒక నిమిషం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సమస్య నుంచి త్వరగా, సులభంగా బయపడవచ్చు.

గాఢంగా శ్వాస వల్ల నాడీ వ్యవస్థ అతిగా స్పందించటం తగ్గి ఊపిరితిత్తులు ప్రశాంతంగా ఉంటాయి. దీంతో మెదడు ఒత్తిడికి గురి కాదు.