07 June 2024
TV9 Telugu
Pic credit - getty
పనస పండును తిన్న తరువాత పొరపాటున కూడా కొన్ని పదార్థాలు తినకూడదట. అలా చేస్తే లేని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పనస తిన్న తర్వాత పాలు తాగకండి. అలా చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. ఇలా చేస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద, తామర, సోరియాసిస్ సమస్యలు వచ్చే అకాశం ఉంది
పనస తిన్న తేనెను తీసుకుంటే ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఇలా చేయడం వలన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.
పనస తొనలు లేదా పనస కాయతో చేసిన వంటలు కాని, ఆహారం కానీ తిన్న తర్వాత పొరపాటున కూడా బొప్పాయిని ఎప్పుడూ తినకూడదు.
కొందరు భోజనం చేసిన తర్వాత తాంబూలం తింటారు. పనస పండు తిన్న తర్వాత పొరపాటున కూడా కిల్లీని తినొద్దు. ఇలా చేస్తే శరీరంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చాలా మంది పనసపండును ఇష్టం కొద్ది అధికంగా తినేస్తుంటారు. అలా చేయడం వలన అసిడిటీ సమస్య రావొచ్చు
పనస రక్తం గడ్డకట్టడంపై ప్రభావం చూపవచ్చు. కనుక రక్త సంబదింత రుగ్మతలు ఉన్నవారు పనస తినే ముందు జాగ్రత్త పాటించాలి.