షుగర్ పేషెంట్స్ దొండకాయ తింటే ఏమవుతుందో తెలుసా..?

Jyothi Gadda

13 October 2024

దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది..! అని చాలా మంది చెబుతుంటారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని పోషకాహార నిపుణులు తేల్చి చెబుతున్నారు.

దొండకాయలో ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉన్నాయి. ఏడాది పొడవునా లభిస్తుంది. ఈ కూరగాయలను కొన్ని ప్రదేశాలలో టిండోరా అని కూడా పిలుస్తారు.

దొండకాయ శరీర అలసట, బలహీనతను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మహిళలకు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దొండకాయ బాగా సహాయపడుతాయి.

ఈ దొండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి వంటి పోషకాలు.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

దొండకాయ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ గ్లూకోజ్‌ని శరీరం నెమ్మదిగా గ్రహించేలా చేస్తాయి. 

ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ టాలరెన్స్‌ని తగ్గిస్తుంది. తరచుగా తింటే రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. 

దొండకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆహారం జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఈ కూరగాయ పరిమాణంలో చిన్నది. కానీ నాణ్యతలో గొప్పది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.