ఐటీ ఉద్యోగులకు కంపెనీల షాక్..!

05 October 2023

ప్రస్తుతం ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతుండటంతో దిద్దుబాటు చర్యలకు రెడీ అవుతున్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలు.

వర్క్ ఫ్రం హోం సంస్కృతిని ముగింపు పలికేందుకు సిద్ధమైన ఐటీ సంస్థలు. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో కొనసాగుతున్న హైబ్రీడ్ మోడల్‌ ఉద్యోగుల విధులు.

వారానికి కనీసం 5 రోజులు కార్యాలయాలకు రావాలంటూ ఐటీ ఉద్యోగులకు అనధికారికంగా స్పష్టం చేసిన ఐటీ కంపెనీలు.

తాజగా భారతదేశంలో పూణే, బెంగళూరు వంటి ఐటీ నగరాల్లో వెంటనే రూల్స్ మార్చేందుకు సిద్ధమవుతున్న ఐటీ కంపెనీలు.

ఇప్పటికే ఐటీ ఉద్యోగులను నవంబర్ నెల నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని సూచించిన ఫిసర్వ్ కంపెనీ.

వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఐటీ ఉద్యోగులకు సూచించింది ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ.

ఐటీ ఉద్యోగులకు అనధికార ఆదేశాలు జారీ చేసిన టీసీఎస్ సంస్థ, ఎల్‌టీఐమైండ్ ట్రీ, యాక్సెంచర్, హెచ్‌సీఎల్ టెక్.

ఐటీ ఉద్యోగుల్లో ఉత్పాదకత పెంచేందుకు వర్క్ ఫ్రం హోం ముగించాలని నిర్ణయం తీసుకున్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలు.