బేకింగ్ సోడాను వంటలకు ఉపయోగించడం వల్ల శరీరానికి మంచిదేనా కాదా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది.? దీని పట్ల ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారు.?
బేకింగ్ సోడా ఒక సాధారణ పదార్థం. ఇది వంటలు, శుభ్రపరచడం, వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అతిగా వాడితే దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి బేకింగ్ సోడా వల్ల దద్దుర్లు, దురద, మంట వచ్చే అవకాశం ఉంది. శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది.
బేకింగ్ సోడాను అతిగా ఉపయోగించడం వల్ల కడుపులో ఆమ్లాన్ని అరికడుతుంది. ఇది గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తుంది. ఎక్కువగా వాడితే వికారం, వాంతులు, అతిసారం కూడా కావచ్చు.
బేకింగ్ సోడాలో ఎక్కువ సోడియం ఉంటుంది. ఇది రక్తంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తుంది.
ఇప్పటికే మూత్రపిండ సమస్యలు ఉన్నవారు దీని తీసుకోకపోవడం చాలా మంచిది. ఎక్కువగా వాడితే శరీరంలోని పొటాషియం, క్లోరైడ్ ఇతర ఖనిజాల స్థాయిలలో అసమతుల్యత ఏర్పడవచ్చు.
అధిక సోడియం స్థాయిలు రక్తపోటు పెరగడానికి దారితీస్తాయి. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. బేకింగ్ సోడా చర్మానికి చికాకు కలిగిస్తుంది.
బేకింగ్ సోడా చర్మానికి, కళ్లకు చికాకు కలిగించవచ్చు. దానిని తీసుకునేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు రబ్బరు చేతి తొడుగులు, కళ్ళజోళ్ళు ధరించండం మంచిది.