అందం-ఆరోగ్యానికి.. రోజుకో గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే సరి
03 November 2024
TV9 Telugu
TV9 Telugu
కూరగాయలకు అందాల పోటీ పెడితే ఎర్రెర్రని టొమాటోలే గెలుస్తాయంటే అతిశయం కాదు. కూరలకు రంగూ, రుచీ పెంచడంలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ వాటికవే సాటి
TV9 Telugu
వీటిలో పోషకాలూ ఎక్కువే. టొమాటోల్లో విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, భాస్వరం, ఫొలేట్, కార్బోహైడ్రేట్లు, పీచు, ప్రొటీన్లు, గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నాయి
TV9 Telugu
జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మలబద్ధక సమస్య తలెత్తదు. గుండెజబ్బులు, కురులు, గోళ్ల ఎదుగుదలకు తోడ్పడతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తాయి. ఊబకాయం రాకుండా తగినంత బరువు ఉండేలా చేస్తాయి
TV9 Telugu
మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఊపిరితిత్తులు, పొట్ట క్యాన్సర్లను నిరోధిస్తాయి. టొమాటోలు పెద్ద పేగు, గొంతు, నోరు, రొమ్ము, గర్భాశయంలో వ్యాధులను నిరోధిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి
TV9 Telugu
టొమాటో జ్యూస్‌ని నెల రోజుల పాటు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని డైటీషియన్ మమతా శర్మ అంటున్నారు. టొమాటో జ్యూస్‌లో లైకోపీన్ ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్, హై బీపీని తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
టొమాటో రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే దీనిని బరువు తగ్గడానికి, జీర్ణ ఆరోగ్యానికి అద్భుతమైన ఎంపికగా నిపుణులు భావిస్తారు
టొమాటోలను బాగా కడిగి కొత్తిమీర, అల్లం ముక్కలను జ్యూసర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత వడపోసి తాగవచ్చు. రుచి కోసం అందులో కాసింత బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు