ఎవరెస్ట్ కంటే ఎత్తైన మరో పర్వతం ఉందా?
TV9 Telugu
13 March 2024
చాలామంది పర్వతారోహకులు సంవత్సరాలుగా ఎవరెస్టు పర్వతాన్ని జయించాలనుకుంటారు. అధిరోహించడం అందరికీ అంత ఈజీ కాదు.
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఇదేనని చాలా మంది నమ్ముతారు. కానీ వాస్తవానికి భూమిపై ఎత్తైన పర్వతం మరొకటి ఉంది.
భూమిపై ఎత్తైన పర్వతం పేరు మౌనా కీ.. దీని పొడవు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎక్కువ. ఇది ఎక్కడ ఉందనేగా మీ సందేహం.
హవాయిలో ఉన్న మౌనా కీ అనే పేరు గల అగ్నిపర్వతం ఉంది. సముద్ర మట్టంతో మౌనా కీ అగ్నిపర్వతం పొడవు 4,207.3 మీ.
ఆసక్తికర విషయమ ఏమంటే, మౌనా కీ మొత్తం పొడవు 9,330 మీ ఉంది. ఇది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కంటే ఎక్కువగా ఉంది.
టోపోగ్రాఫిక్ ప్రాముఖ్యతలో రెండు రకాలు ఉన్నాయి. తడి ప్రాముఖ్యత, పొడి ప్రాముఖ్యత. దీని ఆధారంగా పర్వతాలను కొలుస్తారు.
మౌనా కీ శిఖరం హవాయిలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పురాతన కాలంలో దాని వాలుపై జనం నివసించిన ఆనవాళ్ళు ఉన్నాయి.
18వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చిన తర్వాత దీనిపై పశువులు జాడలు, జీవరాశులు ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి