భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం అదేనా?
TV9 Telugu
10 October 2024
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా మారుతున్నాయి. పలు దేశాల్లో నిప్పుల వాన కురుస్తోంది. చండ ప్రచండంగా ఎండలు మండిపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు చాలా మారాయి. భానుడి భగభగలతో సంవత్సరాల రికార్డులు బద్దలయ్యాయి.
శతాబ్దం చివరి నాటికి భూమిపై ఉష్ణోగ్రత మరింత గణనీయంగా పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో రానున్న కాలంలో భూమి చాలా వేడెక్కనుందని తెలియడంతో వాపోతున్నారు.
భూమి ఉపరితలం ఉష్ణోగ్రత మానవ జీవితంలోని ప్రతి అంశానికి ముప్పుగా మారుతుందని వెల్లడించారు వాతావరణ నిపుణులు.
ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచం 3 డిగ్రీల సెల్సియస్ వేడెక్కుతుంది.
మానవ కార్యకలాపాల వల్ల వెలువడే కార్బన్ ఉద్గారాలే దీనికి కారణమని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అంటున్నారు.
వాతావరణ మార్పులు, ఇతర కారకాల కలయిక భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతలకు దారితీయవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు.
గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 1650 నగరాల్లో శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి