హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ స్పెషల్‌ ఉప్పు ఎన్నో రోగాలకు దివ్యౌషధం

04 August 2024

TV9 Telugu

TV9 Telugu

ఉప్పు సముద్రంలో కాకుండా పర్వతాల నుంచి కూడా తయారవుతుందనే సంగతి చాలా మందికి తెలియదు. ఇలాంటి ఉప్పులో వేలాది ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట

TV9 Telugu

ఈ ప్రత్యేకమైన ఉప్పును హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు. ఈ ఉప్పును మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని హిమాలయ పర్వతాల సమీపంలో సేకరిస్తారు. ఇది గులాబీ రంగులో కనిపిస్తుంది

TV9 Telugu

ఎలాంటి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైనది ఈ ఉప్పు. ఈ ప్రత్యేక ఉప్పులో 84 రకాల ఖనిజాలు ఉంటాయి. ఇది మన శ్వాసకోశంలోని దుమ్ము, పుప్పొడి, ధూళిని శుభ్రపరచడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

హిమాలయన్ పింక్ ఉప్పు శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒంట్లో శక్తిని కూడా పెంచుతుంది

TV9 Telugu

హిమాలయన్ పింక్ సాల్ట్‌లో ఉండే అధిక మినరల్ కంటెంట్ కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఉప్పు తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది

TV9 Telugu

ఈ ఉప్పు జీవక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్-ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఈ ఉప్పును తీసుకోవడం మంచిది. శరీర జీవక్రియ కార్యకలాపాలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది

TV9 Telugu

చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో, చర్మ తేమను నిర్వహించడంలో, మొటిమలు, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ఉప్పును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది

TV9 Telugu

పింక్ హిమాలయన్ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది