23 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
క్రమరహిత ఆహారపు అలవాట్లు, శారీరకంగా చురుకుగా ఉండకపోవడం వల్ల ఎక్కువ మంది యూరిక్ యాసిడ్ సమస్య బారిన పడుతున్నారు.
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. నడవడానికి ఇబ్బంది పడతారు.
శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయి చాలా కాలం పాటు కొనసాగితే ఆర్థరైటిస్ బాధితులుగా మారవచ్చు.
యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు పలు రకాల పదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకోవాలి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పాలు తాగవచ్చా? దీని గురించి తెలుసుకుందాం
ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం తక్కువ కొవ్వు పాలు తాగడం.. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఉపయోగించడం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
మెడికల్ న్యూస్ టుడే పాలలో ప్యూరిన్ పరిమాణం తక్కువగా ఉంది.150ml లేదా ఒక గ్లాసు వరకు తక్కువ కొవ్వు పాలు త్రాగవచ్చు
ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం చక్కెర పానీయాలు, ఆల్కహాల్, రెడ్ మీట్, డెజర్ట్‌లు మొదలైన వాటికి యూరిక్ యాసిడ్ సమస్య బాధితులు దూరంగా ఉండండి.