ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో పెరుగు ఒకటి. ఇందులోని ప్రొబయోటిక్స్ పొట్టలోని మంచి బాక్టీరియాను పెంచుతాయి. అలాగే చేపలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే
TV9 Telugu
చేపలు ఎంత తిన్నా బరువు పెరగరు. బరువు తగ్గాలనుకునే వారు చేపలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే పెరుగు, చేపలు ఈ రెండూ విడివిడిగా ఆరోగ్యకరమైనవే
TV9 Telugu
ఒకేరోజు ఈ రెండింటినీ భోజనంలో భాగం చేసుకోవడం వల్ల మాత్రం కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు
TV9 Telugu
ముఖ్యంగా పెరుగు, చేపలను భోజనంలో భాగం చేసుకుని తినడం వల్ల జీర్ణ రుగ్మతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి రెండూ కలిపి తింటే పొట్టలో చేపలు,పెరుగు కలుస్తాయి. వాటి వల్ల కొన్ని రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది
TV9 Telugu
కొంతమందిలో జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారు చేపలు, పాలను కలిపి తినడం వల్ల అవి జీర్ణం కావడం కష్టంగా మారుతుంది
TV9 Telugu
చేపలు, పాలతో చేసిన పదార్థాలతో కలిపి తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ట్రిక్, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారు పాలను, చేపలను ఒకే భోజనంలో భాగం చేసుకోకూడదు
TV9 Telugu
చేపలు, పెరుగు... ఈ రెండూ కూడా పోషకాలు దట్టించిన ఆహారాలు. వీటిలో ప్రత్యేకమైన విటమిన్లు, ఖనిజాలు, స్థూల పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో శరీరంలో అధిక పోషకాలు చేరడం వల్ల కూడా జీర్ణక్రియకు అంతరాయాన్ని కలిగిస్తాయి. కాబట్టి వీటిని విడివిడిగా తినడం ముఖ్యం
TV9 Telugu
పాల ఉత్పత్తుల్లో లాక్టోస్ ఉంటుంది. ఈ రెండూ కూడా అరిగించుకోలేని శక్తి గల వారికి దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు అధికంగా అవుతాయి. కాబట్టి ఒక పూట చేపలతో భోజనం చేసినప్పుడు పాలతో చేసిన ఇతర పదార్థాలను కూడా తినకుండా ఉండాలి