చికెన్‎ బోన్స్ తినడం మంచిదేనా.? లేక అనారోగ్యమా.? 

Prudvi Battula 

Images: Pinterest

22 November 2025

చాలామంది చికెన్ అంటే చాలు ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది చికెన్ తినే సమయంలో ఎముకలను కూడా తినేస్తారు.

చికెన్

మరి బోన్స్ తినడం మంచిదా.? కాదా.? అంటే మాత్రం దీని గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు పోషకాహార నిపుణులు.

చికెన్ బోన్స్

చికెన్ తిన్నప్పుడు చిన్న చిన్న ఎముకలను నమిలేస్తుంటారు. అయితే ఈ అలవాటు వల్ల మంచికంటే చెడే ఎక్కువగా ఉందట.

చెడు ప్రభావం ఎక్కువ

కోడి ఎములను తింటే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని, వ్యాధులు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధుల అవకాశం

చికెన్ ఎముకలను తింటే కణితి పెరిగి భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ ప్రమాదం

చికెన్ ఎముకలు అంత త్వరగా జీర్ణం అవ్వవు. అలాంటప్పుడు వాటిని తినడంలో జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయని అంటున్నారు.

జీర్ణ సమస్యలు

చికెన్‎తో పాటు ఎముకలను తిన్నప్పడు అవి పేగుల్లోకి చేరి అడ్డంగా ఉండిపోయవచ్చు లేదా పేగులకు గాయాలు చెయ్యవచ్చు.

ప్రేగులలో అడ్డంకులు

కొన్ని సార్లు చికెన్ గొంతుకు అడ్డంగా ఇరుక్కుపోయి శ్వాసకి ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని సార్లు మరణానికి కూడా కారణం అవుతుంది.

ఊపిరాడక పోవడం