గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా.? 

Ravi Kiran

31 July 2024

గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా.? ఏది సరైన సమయం.? అనే డౌట్ పలువురికి ఉంటుంది. దీనికి వైద్యులు ఏం చెప్పారంటే..?

గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఆమె శరీరంలో పిండం ఎదుగుదలకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి.   

గర్భిణీ స్త్రీ తన మొదటి 16 వారాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఆ సమయంలో ఎలాంటి లైంగిక చర్యలోనూ పాల్గొనకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలని అనుకుంటే.. అది కూడా 16 వారాల తర్వాతే మంచిదని తెలిపారు. అంతేకాదు గర్భిణీ స్త్రీ ఆరోగ్యంపై సంబంధిత డాక్టర్‌ను సంప్రదించి.. సంభోగంలో పాల్గొనాలని చెప్పారు.

గర్భంలో ఏవైనా సమస్యలుంటే, గర్భిణీ స్త్రీ, శిశువు ఆరోగ్యం నిమిత్తం శృంగారంలో పాల్గొనకపోవడం మంచిది. 

గర్భిణీ స్త్రీకి గర్భాశయ సమస్య ఉన్నట్లయితే లేదా బిడ్డ నెలలు నిండకుండానే పుట్టడం లాంటి సమస్యలు గతంలోనే ఎదుర్కుని.. మీరు మళ్లీ గర్భం దాల్చినట్లయితే శృంగారంలో పాల్గొనవద్దు. 

ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

గర్భధారణ సమయంలో శృంగారం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. బిడ్డ, తల్లి ఇద్దరికీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ముందుగా ఆరోగ్య సమస్యలు లేకుంటే, శృంగారంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీ తర్వాత శృంగారంలో పాల్గొనే ముందు వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.