గుండు చేయించుకున్నాక జుట్టు ఒత్తుగా పెరుగుతుందా ??
Phani CH
18 October 2024
ప్రస్తుతం యువతలో అనేక రకాల కారణాల వల్ల జుట్టురాలే సమస్య బాగా పెరిగిపోయింది.. ఈ సమస్య తగ్గించడం కోసం అనేక రకాల మార్గాలను అనుసరిస్తున్నారు.
ఆ అనుసరించే మారగల్లో ఒకటి గుండు కొట్టించుకోవడం.. అయితే నిజంగా గుండు కొట్టించుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే గుండు చేయించుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగదు అది భ్రమ మాత్రమే అని అంటున్నారు చాలామంది నిపుణులు..
గుండు చైచుకున్నప్పుడు మృత వెంట్రుకల కణాలు పూర్తిగా తొలగిపోతాయి. దాంతో.. గుండు తర్వాత పెరిగే వెంట్రుకలు సూర్యరశ్మికి లేదా ఇతర రసాయనాలకు గురికావు.
కాబట్టి, షేవ్ చేసిన తర్వాత ముందు కన్నా కాస్త నల్లగా గుండు కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకానీ జుట్టు మందంలో ఎలాంటి తేడాలూ ఉండవంటున్నారు.
తలపై షేవ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికి కొన్ని లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముందుగా జుట్టును మెయింటెన్ చేయడం ఈజీగా ఉంటుంది.
అంటే.. మాటిమాటికీ దువ్వడం, బ్లో డ్రైయర్ వంటి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే గుండు కొట్టించడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
తలపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతాయి. ఫలితంగా కొంతవరకు జుట్టు రాలే సమస్య తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చేయండి