నెయ్యి విషయంలో ఆ అపోహ వద్దు..!

January 30, 2024

TV9 Telugu

నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వులు పెరిగి లావవుతామేమోననే భయం చాలా మందికి ఉంటుంది. ఇది గుండెకు అస్సలు మంచిది కాదని, అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని భావిస్తారు

దీంతో తినాలని ఉన్నా సరే.. నోరు కట్టేసుకుంటారు. నిజానికి పలు పోషకాల సమ్మేళనమైన నెయ్యి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు

నెయ్యిలో ఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. వంటి పోషకాలన్నీ  ఉంటాయి

శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాల స్థాయులు తగ్గిపోవడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నెయ్యి రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆ భయం లేనట్లే

నెయ్యిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఈ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది

నెయ్యి వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం మరింత సులభంగా అరుగుతుంది. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది

ఆరోగ్యానికి మంచిదన్నారు కదా అని మరీ ఎక్కువగా తింటే మత్రం లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. రోజుకు రెండు టీస్పూన్ల నెయ్యిని తీసుకుంటే సరిపోతుంది

అలాగే గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వారి సమస్య స్థాయిని బట్టి నెయ్యి వినియోగించడం మంచిది లేదంటే డాక్టర్ సలహా  పాటించాలి