రాత్రి పెరుగు తినకూడదా.? 

29 December 2023

పెరుగు శరీరంలో ఎన్నో రకాల జీవ క్రియలకు మేలు చేస్తుంది. అనే పోషకాలకు పెరుగు పెట్టింది పేరు. అందుకే పెరుగును తీసుకోవాలని సూచిస్తుంటారు.

ఇందులోని ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయితే ఆరోగ్యానికి మేలు చేసే పెరుగును రాత్రిపూట తీసుకోకూడదని చెబుతుంటారు. ఇంతకీ ఇందులో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగును సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడు తీసుకున్నా ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదని అంటున్నారు. 

అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం రాత్రిపూట పెరుగుకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు తరచుగా జలుబు చేసే అలర్జీ ఉన్నవాళ్లు రాత్రిపూట పెరుగును తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. 

పెరుగు కఫంకి కారణమవుతుందని అందుకే రాత్రిపూట పెరుగు తీసుకోవద్దని చెబుతారు. అయితే పెరుగును చిక్కగా కాకుండా నీటిని కలిపి తీసుకుంటే ఏం కాదని సూచిస్తున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.