12 October 2024
TV9 Telugu
Pic credit - Getty
సరైన ఆహారం తీసుకోకపోవడం, చాలా కాలంగా అనారోగ్యంతో ఉండటం లేదా కొన్ని కారణాల వల్ల అధిక రక్తస్రావం జరిగి శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది .
ఈ లోపాన్ని అధిగమించడానికి ఐరెన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఎర్ర రక్త కణాలను రూపొందించడంలో సహాయపడే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
రక్తహీనత ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, విపరీతమైన అలసట, లేత చర్మం, జుట్టు రాలడం, గుండె కొట్టుకోవడం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్తహీనత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి. మందులు తీసుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి ఆహారంలో మార్పు చేసుకోవాలి
రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్ ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాదు క్యారెట్,యు నల్ల ద్రాక్ష లేదా ఎండుద్రాక్ష మేలు చేస్తుంది .
క్యారెట్, బీట్‌రూట్‌లను సమానంగా తీసుకుని వాటి ముక్కల్లో ఎనిమిది నుంచి పది నల్ల ఎండుద్రాక్ష లేదా నల్ల ద్రాక్షను వేసి జ్యూస్ చేయండి.
క్యారెట్, బీట్‌రూట్ , నల్ల ఎండుద్రాక్షతో చేసిన ఈ జ్యూస్‌ను ఫిల్టర్ చేయడానికి బదులుగా..అలాగే తాగండి . పీచుపదార్ధం ఆరోగ్యానికి మంచిది .