జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా?

TV9 Telugu

11 January 2024

మీరు జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకొనేవారికి అతి తక్కువ ధరలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది.

ఐఆర్‌సీటీసీ ఇందులో భాగంగానే భారత్‌ గౌర్‌ రైళ్లు పేరుతో నడిపిస్తున్న రైళ్లకు ప్రయాణికుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఈ టూరిస్ట్‌ సర్క్యూట్ రైలు యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జనవరి 23వ తేదీన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి యాత్ర ప్రారంభమై దక్షిణాదిలో తమిళనాడుతో పాటు కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది.

9 రోజులు పాటు సాగే ఈ యాత్రలో రామేశ్వరం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర దర్శనం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు లను కవర్ చేస్తుంది.

సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మంతో పాటు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్‌లో ప్రయాణికులు ఎక్కవచచ్చు, దిగవచ్చు.

జనవరి 23 నుంచి 31 జనవరి వరకు యాత్ర ఉంటుంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీలో ఈ యాత్రకు సంబంధించి బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి.

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి 23-01-2024 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి తిరిగి జనవరి 31వ తేదీన సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. జీఎస్‌టీతో కలిపి ఒక్కొక్కరికీ.. స్లీపర్‌ క్లాస్‌ 14,100 రూపాయలు కాగా, థర్డ్‌ ఏసీ 21,500, కంఫర్ట్‌ కేటగిరీ సెకెండ్‌ ఏసీ ధర 27,900రూపాయలుగా నిర్ణయించారు.