IRCTC శ్రావణ్ స్పెషల్.. నయా టూర్ ప్యాకేజీ.. 

TV9 Telugu

17 July 2024

IRCTC మరో కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. జోతిర్లింగ దివ్య దక్షిణ్ యాత్ర పేరుతో ఈ టూర్ మొత్తం 9 రోజులు, 8 రాత్రులు  భరత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లో జరగనుంది.

ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మదురై కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, తంజావర్ ప్రాంతాలు కవర్ అవుతాయి.

ఈ టూర్ ఆగష్టు 4న  సికింద్రాబాద్ నుంచి 12 గంటలకు  మొదలై 2వ రోజు  ఉదయం 7:00కి తిరువణ్ణామలై చేరుకొని ఫ్రెష్ అయ్యి అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు.

అక్కడి నుంచి బయలుదేరి 3వ రోజు ఉదయం 6:30కి కుదల్‌నగర్‌ చేరుకొని రోడ్ మార్గంలో రామేశ్వరానికి వెళ్లి ఫ్రెష్ అయ్యి స్థానిక దేవాలయాలను దర్శించి రాత్రి బస చేస్తారు.

4వ రోజు రామేశ్వరం నుండి మధురైకి వెళ్లి మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించి కుదల్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. నుంచి 11:30కి రైలులో బయలుదేరుతారు.

5వ రోజు ఉదయం కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకొని కన్యాకుమారి వెళ్లి రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శించి రాత్రి బస చేస్తారు.

6వ రోజు ఉదయం రోడ్డు మార్గంలో త్రివేండ్రంలో శ్రీ పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ చూసి తిరుచిరాపల్లికి బయలుదేరి  7వ రోజు తిరుచిరాపల్లికి వెళ్తారు.

శ్రీరంగం ఆలయాన్ని దర్శించి తర్వాత తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించి  8వ రోజంతా ట్రైన్ లో గడిపి 9వ రోజు ఉదయం 2:30కి  సికింద్రాబాద్ చేరుకుంటారు.

ఎకనామిక్ లో పెద్దలకు రూ 14250, పిల్లలకు రూ 13250, స్టాండర్డ్ లో పెద్దలకు రూ 21900,  పిల్లలకు రూ 20700; కంఫర్ట్ లో పెద్దలకు రూ 28450, పిల్లలకు రూ 27010గా ధరలు నిర్ణయించారు.

ఈ టూర్ సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట నుంచి అందుబాటులో ఉంది.