ఊపరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే ఇండోర్ మొక్కలు..

7 August 2023

కలబంద: కలబంద మొక్క మీ ఇంట్లోని గాలిని క్లీన్ చేస్తుంది. ఈ మొక్కను పెంచడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. 

స్పైడర్ ప్లాంట్: స్పైడర్ ప్లాంట్‌ తక్కువ మొత్తంలో క్లోరోఫిల్‌ని, ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ని విడుదల చేస్తుది. ఇంకా ఈ మొక్క గాలిలోని కాలుష్య కారకాలను తొలగించి మీ ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. 

స్నేక్ ప్లాంట్: ఇండోర్ మొక్కగా పెంచుకునే స్నేక్ ప్లాంట్ కూడా మీ లంగ్స్‌కి ఉపయోగకరమే. అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేసే ఈ మొక్క అంతే మోతాదులో కార్బన్‌డై ఆక్సైడ్‌ని సంగ్రహిస్తుంది.

పీస్ లిల్లీ: పీస్ లిల్లీ గాలిలోని కాలుష్యాలను తొలగించి శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఈ మొక్క ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. 

రబ్బర్ మొక్క: రబ్బర్ మొక్కకు తన పరిసర ప్రాంతాంలోని గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్‌డై ఆక్సైడ్‌ను తొలగించే శక్తి ఉందని నాసా క్లీన్ ఎయిర్ స్టడీ తెలిపింది. ఈ క్రమంలో మీరు మీ లంగ్స్ హెల్త్ కోసం రబ్బర్ మొక్కను కూడా పెంచుకోవచ్చు.