రైల్వే ప్రతిష్టాత్మక నిర్ణయం.. ఒకసారి రెండు వందే భరత్ స్లీపర్లు..
30 September 2025
Prudvi Battula
భారతీయ రైల్వేలు ఒకేసారి రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్నాయి. ఇది సుదూర సెమీ-హై-స్పీడ్ ప్రయాణంలో ఒక ప్రధాన అడుగు.
"రెండవ రైలు అక్టోబర్ 15, 2025 నాటికి సిద్ధంగా ఉండవచ్చు. రెండు రైళ్లు ఒకసారి లంచ్ చేస్తాం. సాధారణ సర్వీసులు కొనసాగించడానికి రెండవ రైలు ముఖ్యమైనది" అని వైష్ణవ్ అన్నారు.
సెప్టెంబర్ 2024లో ఆవిష్కరించబడిన మొదటి రేక్ ఇప్పటికే ట్రయల్స్, టెస్టింగ్ పూర్తి చేసుకుంది. ఢిల్లీలోని షకుర్ బస్తీ కోచింగ్ డిపోలో ఉంచబడింది.
రెండవ రైలు పూర్తిగా సేవలకు సిద్ధమైన తర్వాతే లాంచ్ చేయడం జరుగుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు.
రెండవ రేక్ ట్రయల్స్, టెస్టింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మార్గాలు ఖరారు చేయబడతాయి. కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
వందే భారత్ స్లీపర్ గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేలా రూపొందించబడింది. ఇది భారత రైల్వే ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన స్లీపర్ ట్రైన్.
ఈ వందే భరత్ రైలు USB ఛార్జింగ్ పోర్ట్‌లతో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు, మెరుగైన క్యాటరింగ్ కోసం మాడ్యులర్ ప్యాంట్రీలు వంటి అప్‌గ్రేడ్ సౌకర్యాలను అందిస్తుంది.
అలాగే ఇందులో పబ్లిక్ అనౌన్స్‌మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లు అదనపు భద్రత కోసం CCTV కెమెరాలు ఉన్నాయి.
వికలాంగ ప్రయాణికులకు ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లు ఉంటాయి. ఫస్ట్ AC కోచ్‌లలో వేడి నీటి షవర్లు కూడా ఉంటాయి.