08 April 2024
TV9 Telugu
Pic credit - Pixabay
సోంపు గింజలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా మందిసోంపు గింజలను తింటారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తేలికపాటి తీపి రుచి కలిగిన సోంపును ఎక్కువగా తినే ఆహార పదార్ధాలలో రకరకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని నమలడం లేదా దాని నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చలవచేసే స్వభావం కలిగిన సోంపుని వేసవిలో తీసుకుంటే చాలా మంచిది. రోజూ ఉదయాన్నే సోంపు నీటితో ప్రారంభించినట్లయితే.. అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది
ఫెన్నెల్ వాటర్ డిటాక్స్ లాగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మీ ముఖంపై మెరుపును కూడా తెస్తుంది.
సోంపులో విటమిన్లు, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు. ముఖ్యంగా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కనుక నీటిని తాగడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి
సోపులో ఫైబర్ కూడా ఉంటుంది. శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక జీర్ణక్రియను మెరుగుపరచడంలో పాటు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఫెన్నెల్ వాటర్ తీసుకోవడం కొలెస్ట్రాల్, ఇన్సులిన్ మొదలైనవాటిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రయోజనకరంగా ఉంటుంది.