ఈ ఫుడ్స్ మీ డైట్‎లో ఉంటే.. స్పెర్మ్ కౌంట్ రాకెట్‎లా పై పైకి..

27 September 2025

Prudvi Battula 

పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి, ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు మంచి ఆహరం తీసుకోవాలి.

వీర్య కణాల ఉత్పత్తి మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. వీటి ఉత్తత్తి పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ముఖ్యం.

విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకుంటే సస్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించి వీర్య కణాలు వృద్ధి చెందుతాయి.

పండ్లు తింటే స్పెర్మ్ కౌంట్ పెరిగి సంతానలేమి సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించవచ్చు.

వాటితో పాటు వాల్‌నట్స్, చియా సీడ్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉన్న ఫుడ్స్ స్పెర్మ్ అధికంగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడతాయి.

అలాగే ప్రోటీన్లు అధికం ఉన్న మాంసం, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవడం వల్ల కూడా వీర్య కణాలు పెరుగుతాయని వైద్యులు అంటున్నారు.

రోజూ వ్యాయామం చేసిన వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే యోగా, మెడిటేషన్చేస్తే ఒత్తిడిని తగ్గి వీర్య కణాల వృద్ధి ఎక్కువగా ఉంటుంది.