జీన్స్ వేసుకుంటే జైలుకే..! ఎక్కడో తెలుసా?

Venkata Chari

12 Jul 2025

ప్రపంచంలో కొన్ని వింత దేశాలు తమ ప్రజలపై ప్రమాదకరమైన చట్టాలను విధిస్తుంటాయి. వీటిని చూసి అక్కడి ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది.

ఇలాంటి ఎన్నో కండీషన్స్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో అమలవుతూనే ఉన్నాయి. అందులో ఒకటి జీన్స్ ధరించొద్దు అనడం.

ప్రస్తుతం జీన్స్ ఎన్నో దేశాల్లో ప్రజలకు డైలీ వేర్‌గా మారిపోయింది. జీన్స్ లేకుండా బయటకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.

జీన్స్ ధరించడానికి అనుమతి లేని దేశం గురించి మీకు తెలిస్తే, కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఏ దేశం ఇలాంటి కండీషన్ పెట్టిందో ఇప్పుడు చూద్దాం..

ఈ వింత చట్టాన్ని ఆమోదించిన దేశం పేరు ఉత్తర కొరియా. ఇది జీన్స్‌ను పాశ్చాత్య నాగరికత నుంచి వచ్చిన వస్తువుగా భావిస్తుంది.

దీని కారణంగా ఉత్తర కొరియా తన ప్రజలు జీన్స్ ధరించడాన్ని నిషేధించింది. దీంతో అక్కడి ప్రజలు జీన్స్‌లకు దూరంగా ఉంటారు.

నిజానికి ఉత్తర కొరియా అమెరికాను తన శత్రువుగా భావిస్తుంది. అందుకే అమెరికా నుంచి వచ్చిన జీన్స్‌ను వాడేందుకు అనుమతించలేదు.

ఈ సంస్కృతి అమెరికా నుంచి వచ్చిందని, అందుకే ఇది రాజద్రోహం కంటే తక్కువ కాదని వారు నమ్ముతారు.