రెడ్ డ్రెస్ లో రెజీనా అందాలతో దండ యాత్ర.. కుర్రకారు గెట్ రెడీ
Phani CH
05 Jul 2025
Credit: Instagram
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ.
అలాగే కొన్ని సినిమాల్లో విలన్ గానూ ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
నటి రెజీనా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో, ఆమె పిల్లల టీవీ ఛానెల్ లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది.
14 సంవత్సరాల వయస్సులో, నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది.
ఆ తర్వాత 2012లో తెలుగులో ‘శివ మనసుల శ్రుతి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది.
2019లో ‘ఏక్ లత్కీ కో దేకా దో’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.
నటి రెజీనా కసాండ్రా ప్రస్తుతం మిజ్ తిరుమేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.