ముఖం ఇలా శుభ్రం చేసుకుంటే చర్మం పొడిబారదు..

January 16, 2024

TV9 Telugu

చలికాలంలో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం అంత సులువుకాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారి సమస్యలు తలెత్తుతుంటాయి

అయితే తెలిసో తెలియకో శీతాకాలంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా చర్మ సమస్యలు వస్తున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు

ముఖం కడుక్కునే క్రమంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాటిస్తే చర్మ ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

నురగ వచ్చే ఫేష్‌ వాష్‌లు, బాడీ వాష్‌లు వంటివి చలికాలంలో ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుందని నిపుణులు అంటున్నారు

వీటికి బదులు జెంటిల్‌, క్రీమ్‌ క్లెన్సర్లు ఎంచుకుంటే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అలాగే డబుల్‌ క్లెన్సింగ్‌ అంతమంచిది కాదట

అంటే ఒకేసారి రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకోవడం అన్నమాట. ఆయిల్‌ ఆధారిత క్లెన్సర్‌తో ముఖం కడుక్కున్న తర్వాత ఆపై నీటి ఆధారిత క్లెన్సర్‌ వాడితే చర్మం మరింతగా పొడిబారిపోతుంది

ముఖంపై పేరుకున్న మృతకణాల్ని తొలగించుకునే క్రమంలో ‘ఎక్స్‌ఫోలియేషన్‌’ ప్రక్రియను ఎక్కువసార్లు పాటించినా చర్మ ఆరోగ్యం దెబ్బతిని పొడిబారుతుంది

ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌తో వారానికి రెండుసార్లు, రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చల్లటి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే ముఖం శుభ్రం చేసుకోవాలి