అరటి తొక్కే కదా అని పడేస్తే..  ఆ లాభాలు మిస్..

Prudvi Battula 

Images: Pinterest

30 November 2025

అరటిపండు తొక్క భాగం మీద మెత్తని పీచు వంటి పదార్ధం ఉంటుంది. అరటి తొక్కల ద్వారా చర్మ సౌందర్య పెరిగి మొఖం ప్రకాశిస్తుంది.

అరటిపండు తొక్క

దీని వలన జుట్టుకు కూడా అనేక లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ పీచు వంటి పదార్ధం అనేక పోషక విలువలకు నిలయం.

జుట్టుకు లాభాలు

దీనిలో కెరోటినాయిడ్స్, ఫలవినోయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటుగా శరీర పనితీరు మెరుగుపడటానికి ఉపయోగపడే మాంగనీస్, పొటాషియం లభిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

అరటి పళ్ళ తొక్కలు శరీరంలోని మలినాలను బయటకు పంపించి శరీరాన్ని డిటాక్స్ చెయ్యడంలో తోడ్పడతాయన్నది నిపుణుల మాట.

డిటాక్స్

అరటి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు పచ్చ ఛాయా తొలిగిపోయి, దంతాలు తెల్లగా, నిగారింపుగా కనిపిస్తాయి.

పళ్ళుకు మేలు

అరటి తొక్కలతో మొఖం మీద మసాజ్ చేస్తే మచ్చలు తగ్గి, కాంతివంతంగా ప్రకాశించడానికి తోడ్పడుతుందని అంటున్నారు నిపుణులు.

మసాజ్

కళ్ల కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ కూడ అరటి తొక్కలతో మసాజ్ చేస్తే ఆ మచ్చలు తగ్గడానికి ఆస్కారముంటుంది.

డార్క్ సర్కిల్స్ దూరం

వీటిని జుట్టుకు అప్లై చేసుకుంటే, జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది జుట్టు ఒత్తుగా, నిగారింపుగా ఉంటుంది. వీటిని తింటే గుండె జబ్బులు, ఇతర రోగాలను తట్టుకునే శక్తీ లభిస్తుంది.

గుండెకి మేలు