యాపిల్ సైడర్ వెనిగర్‌ అతిగా తీసుకున్నారంటే.. మీ ఆరోగ్యం స్వాహా.. 

Prudvi Battula 

Images: Pinterest

30 November 2025

చాలా మంది యాపిల్ సైడర్ వెనిగర్‌ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గవచ్చని అనుకుంటారు. నిజానికి దీని వల్ల బరువును తగ్గించవచ్చు లేదా తగ్గించకపోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్‌

కానీ యాపిల్ సైడర్ వెనిగర్ అధికంగా వినియోగిస్తే అనేక ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవేంటో తెలుసుకుందాం..

ఆనారోగ్య సమస్యలు

రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది కేలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది.

కడుపు సంబంధిత సమస్యలు

గ్యాస్ట్రోపెరెసిస్‌ సమస్యలను కూడా సృష్టిస్తుంది. గ్యాస్ట్రోపరేసిస్‌తో బాధపడేవారిలో గుండె వేగం పెరగడం లేదా తగ్గడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గ్యాస్ట్రోపెరెసిస్‌ ఇబ్బంది

యాపిల్‌ వెనిగర్‌ని తరచూ తీసుకుంటే దంతాల సమస్యలు తలెత్తుతాయి. దంతాలు పసుపు రంగులోకి మారడం, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి.

దంతాలకు హాని

దీనిలోని యాసిడ్ కారకాలు దంతాల్లో సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. యాపిల్ వెనిగర్ తీసుకోవాలి.. అయితే పరిమితంగా మాత్రమే.

పరిమితంగా మాత్రమే

యాపిల్ వెనిగర్ తరచూ తీసుకుంటే శరీరంలో పొటాషియం నెమ్మదిగా తగ్గిముఖం పడుతుంది. దీని కారణంగా ఎముకలలో నొప్పి ఎముకలు విరిగిపోయే అవకాశం కూడా ఉంది.

ఎముకలకు మంచిది కాదు

దీన్ని తీసుకొనే ముందు ఓసారి వైద్యుడిని సంప్రదించడం మాత్రం మర్చిపోకూడదు. శరీరంలో పొటాషియం లేకపోవడం వల్ల హైపోకలేమియా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వైద్యుడి సలహా