పొద్దు తిరుగుడు విత్తనాలు చేసే మ్యాజిక్ తెలిస్తే..

Jyothi Gadda

29 October 2024

పొద్దుతిరుగుడు విత్తనాలు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.

పొద్దుతిరుగుడు గింజల్లో మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను నియంత్రించే 100 రకాల ఎంజైములు ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు ఈ విత్తనాల్లోని ఎంజైములు ఎంతో మేలు చేస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో నియాసిన్, విటమిన్ ఇ, బి 1, బి 6, ఇనుము, రాగి, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. మలబద్ధకం ఉన్నవారు పొద్దుతిరుగుడు గింజలను ప్రతి రోజూ జీర్ణశక్తి పెరుగుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలలో కనిపించే బీటా-సిటోస్టెరాస్, బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రొమ్ము క్యాన్సర్ తో సహా వివిధ క్యాన్సర్లను రాకుండా నిరోధిస్తాయి.

పావుకప్పు పొద్దు తిరుగుడు విత్తనాల్లో 90 శాతం విటమిన్- ఇ లభిస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. 

డయాబెటిస్ బాధితులకు పొద్దు తిరుగుడు చాలా మంచిది. ఈ విత్తనాలను రోజూ తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాదు, పెద్ద పేగు క్యాన్సర్‌ను నివారించే గుణాలు ఉన్నాయి.

ఆరోగ్యంతో పాటు, అందాన్ని కాపాడడంలో కూడా పొద్దు తిరుగుడు ముందే ఉంటుంది. చర్మాన్ని మృదువుగా మార్చి రక్త సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.