కివిని మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలకు ఇక మూడినట్లే..

Prudvi Battula 

Images: Pinterest

21 November 2025

ఏడాది మొత్తం దొరికే పండ్లలో కివి పండు కూడా ఒకటి. ఈ పండు తింటే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కివి

దీనిలో ఉన్న పోషకాల కారణంగా అనారోగ్యాలకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకుంటే మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి.

దివ్యఔషధం

గుండె సమస్యలు ఉన్నవారు రోజూ కివి పండు తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని దూరం చేస్తుందని అంటున్నారు నిపుణులు.

గుండెకి మేలు

కివి పండు వినియోగం వల్ల అధిక రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అందుకే బీపీ ఉన్నవారు కివి పండును తినవచ్చు.

రక్తపోటు తగ్గుముఖం

ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీంతో మధుమేహం తగ్గుతుంది. డయాబెటిస్ రోగులు దీన్ని నిర్భయంగా తినవచ్చు.

రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణ

అంతేకాదు మానవ శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు తరిమేస్తుంది. దీనిలో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే గుణాలు ఉన్నాయి.

టాక్సిన్స్ బయటకు

కివి పండు తరుచూ తినడం వల్ల చర్మంపై ముడతలు, మొటిమలు పోయి శరీరాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

చర్మ సమస్యలను తగ్గిస్తుంది

కివి పండు రోజూ తింటే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. దీంతోపాటు ఒత్తిడి, కీళ్ల నొప్పులు, కడుపులోని అల్సర్‌లను కూడా నయం చేస్తుంది.

ఒత్తిడి, కీళ్ల నొప్పులు దూరం