టీ పదేపదే వేడి చూసి తాగుతున్నారా? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే..
Prudvi Battula
Images: Pinterest
18 November 2025
చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. అయితే పనుల హడావిడి కారణం పెట్టుకున్న టీ తాగగా ముందే చల్లారిపోతుంది.
టీ
అప్పుడు మళ్లీ వేడిచేసుకొని తాగుతారు. కానీ ఇలా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు వైద్య నిపుణలు.
మళ్లీ వేడిచేసుకొని తాగుతారు
టీ మళ్లీ వేడి చేసుకొని తాగడం వల్ల కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
కడుపుకు హాని
టీ పెట్టి కొద్దిసేపు అలానే వదిలేస్తే.. దానిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది తాగితే అనారోగ్యానికి కారణం అవుతుంది.
అనారోగ్యానికి కారణం
మళ్లీ మళ్లీ వేడి చేసిన టీ తాగడం వల్ల అజీర్తికి కారణం అవుతుంది. ఒక్కోసారి జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జీర్ణసంబంధ సమస్యల అవకాశం
టీ మాటి మాటికి వేడి చెయ్యడం వల్ల కెఫీన్ ఎక్కువ విడుదలవుతుంది. ఇది తాగడం వల్ల విసుగు, నిద్రలేమికి కారణం అవుతుంది.
విసుగు, నిద్రలేమికి కారణం
టీ ఎక్కువ సార్లు వేడి చేసి తాగడం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో రక్త హీనత సమస్య వచ్చే అవకాశం ఉంది.
రక్త హీనత సమస్య వస్తుంది
కాస్త రిఫ్రెష్‌మెంట్ కోసమని టీ తాగుతాం. దాన్ని తాజాగా తీసుకుంటేనే మేలు జరుగుతుంది. లేదంటే సమస్యలు తప్పవు.
తాజాగా తీసుకుంటేనే మేలు
మరిన్ని వెబ్ స్టోరీస్
రాత్రుళ్లు నిద్ర లేదా.? ఏ రాశి వారు ఏం చెయ్యాలంటే.?
బెస్ట్ సన్ రైజ్ చూడాలంటే.. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
ఈ టిప్స్ పాటిస్తే.. పసుపు రంగు క్లియర్.. మిల మిల మెరిసే దంతాలు..