ఈ చిట్కాలను పాటిస్తే కరెంటు బిల్లు చాలా వరకు సేఫ్!

09 December 2023

సాధారణ బల్బుకు బదులుగా, తక్కువ శక్తి బల్బును ఉపయోగించండి. CFL లేదా LED లైట్లను ఉపయోగించడం ద్వారా 70% వరకు విద్యుత్ ఆదా చేయవచ్చు.

ఫ్రిజ్‌లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోయినట్లయితే, దాని కారణంగా ఫ్రిజ్ కూలింగ్ పవర్ తగ్గిపోయి ఎక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది.

ఫ్రీజర్‌ను ఎల్లప్పుడూ డీఫ్రాస్ట్‌గా ఉంచండి. వేడి ఆహారాన్ని కొంచెం చల్లబడిన తర్వాత మాత్రమే ఫ్రీజ్ చేయండి.

టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జర్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగించిన తర్వాత, ఖచ్చితంగా వాటి పవర్ స్విచ్ ఆఫ్ చేయండి.

మీరు ఏసీని నడుపుతున్నట్లయితే, ఇంటి కిటికీలు, తలుపులు, స్కైలైట్లు మొదలైనవన్నీ సరిగ్గా మూసి ఉండేలా చూసుకోండి.

అవసరమైతే ఎయిర్ కండీషనర్ కి బదులుగా సీలింగ్ ఫ్యాన్ లేదా టేబుల్ ఫ్యాన్ ఉపయోగించడం ద్వారా విద్యుత్ చేసుకోవచ్చు.

కంప్యూటర్‌లో పని చేసిన తర్వాత ఎల్లప్పుడూ పవర్ స్విచ్‌ను ఆఫ్ చేయండి. విరామం తీసుకుంటే, మానిటర్‌ను ఆఫ్ చేయండి.

కంప్యూటర్‌ను ఎక్కువసేపు స్లీప్ మోడ్‌లో ఉంచకుదది. అందుకు బదులుగా కంప్యూటర్‌ను Shut Down చేయడం మంచిది.