అర‌టి పండు అతిగా తీసుకున్నారంటే.. మీ బాడీ షెడ్డుకి పోయినట్టే..

Prudvi Battula 

Images: Pinterest

10 November 2025

అర‌టి పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగాలు నుండి రక్షించడంలో సహాయపడతాయి.

రోగాల నుంచి రక్షణ

అయితే అర‌టి పండ్ల‌ను రోజుకు 1 లేదా 2 మాత్రమే తినాలి. పెద్ద‌ది అయితే ఒక‌టి. అదే వ్యాయామాం చేస్తే రోజుకు 2 లేదా 3 తినాలి. అంతకు మించితే అనారోగ్యం.

1 లేదా 2 మాత్రమే తినాలి

అర‌టి పండ్ల‌లో అధిక పొటాషియం కిడ్నీల‌పై భారం ప‌డుతుంది. అందుకే వీటిని మోతాదుకు మించి వద్ద అంటున్నారు నిపుణులు.

కిడ్నీల‌పై భారం

ఒక అర‌టి పండ్ల‌లో పండులో 14 గ్రాముల వ‌ర‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర ఉన్నందున దీన్ని తింటే 105 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది.

105 క్యాల‌రీల శ‌క్తి

ఇందులోని ఫైబ‌ర్ వ‌ల్ల ఈ చ‌క్కెర‌లు ర‌క్తంలో నెమ్మ‌దిగా కలవడంతో షుగ‌ర్ లెవ‌ల్స్ స్లోగా పెరుగుతాయి. కాబ‌ట్టి డ‌యాబెటిస్ ఉన్న‌వారు దీన్ని నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు.

డ‌యాబెటిస్ ఉన్న‌వారు

కానీ అధికంగా తింటే మాత్రం షుగ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువగా పెరిగే ప్ర‌మాదం ఉంటుంది. అందుకే మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది.

లెవ‌ల్స్ ఎక్కువగా పెరిగే ప్ర‌మాదం

అరటి ఎక్కువగా తింటే శ‌రీరంలో క్యాల‌రీలు అధికంగా పెరుగుతాయి. దీంతో బ‌రువు పెరుగుతారు. క‌నుక ఈ పండ్ల‌ను మోతాదులోనే తినాలి.

బ‌రువు పెరుగుతారు

రోజూ అర‌టి పండ్ల‌ను తినడం వల్ల బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

మోతాదులో మాత్రమే