బరువు తగ్గాలా..? ఈ స్పెషల్ ఇడ్లీ తింటే చాలు! నాజూకై పోతారు..

24 September 2024

TV9 Telugu

TV9 Telugu

దక్షిణ భారత దేశంలో ఏ చోటికి వెళ్లినా.. తప్పనిసరిగా కనిపించే కామన్‌ స్నాక్స్‌లో ఇడ్లీ ఒకటి. వేడివేడిగా, మెత్తగా ఉండే ఇడ్లీలను కమ్మని చట్నీతో కలిపితే తింటే దాని రుచి వేరబ్బ..!

TV9 Telugu

బరువు తగ్గాలనుకునే వారు ఇండ్లీలికు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ముఖ్యంగా ఈ కింది ఐదు వైరంటీ ఇడ్లీ వంటకాలను తయారు చేసుకుని తింటే ఆరోగ్యంతోపాటు బరువు కూడా సులువుగా తగ్గొచ్చు

TV9 Telugu

ఓట్స్ ఇడ్లీలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని కడుపు నిండా తిన్నా బరువు సులువుగా తగ్గొచ్చు

TV9 Telugu

బీట్‌రూట్‌లో వివిధ పోషకాలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడానికి బీట్‌రూట్ ఇడ్లీ కూడా మంచి ఎంపిక. బీట్‌రూట్‌ తురిమి ఇడ్లీ పిండిలో కలిపి తయారు చేసుకుని తినొచ్చు

TV9 Telugu

మొలకల ఇడ్లీ.. ఈ మొలకల ఇడ్లీని మొలకెత్తిన గింజలతో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది

TV9 Telugu

క్యారెట్ ఇడ్లీలో కేలరీలు తక్కువ, పోషకాలు మెండుగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అధిక సమయం కడుపు నిండుగా ఉంటుంది. తద్వారా ఇతర ఆహారాలు తీసుకోకుండా ఉంటారు

TV9 Telugu

సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఇడ్లీ ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడానికి బలేగా పని చేస్తుంది

TV9 Telugu

అందుకే ఆరోగ్యానికి మంచిదనీ తేలికగా జీర్ణం అవుతుందనీ అమ్మలంతా వారంలో మూడు నాలుగు రోజులు ఇడ్లీనే చేస్తుంటారు. ఇకపై ముఖం మాడ్చుకోకుండా హ్యాపీగా తినేయండి