ఈ జ్యూస్ ఆరోగ్యానికి దివ్య ఔషధం! పరగడుపున తాగితే..
Jyothi Gadda
2 September 2024
బీట్‌రూట్ జ్యూస్ విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అద్భుతమైన మూలం. ఇందులో పోషకాలు పుష్కలం. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కణాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
రక్తహీనత, రక్తపోటు,గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలున్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
బీటైన్, నైట్రేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నిండివున్నాయి. బీట్‌రూట్ ఫైబర్‌తో నిండి ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనానికి సహాయపడతాయి.
వివిధ కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ దుంపలు తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్స్ రక్తపోటును తగ్గించడానికి సహకరిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్ శరీరానికి శక్తిని ఇస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ర్ఘకాలంగా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్‌రూట్ చాలా ప్రయోజనకరమైన కూరగాయ.
ఈ జ్యూస్ పోషకాహారాన్ని అందిస్తుంది. శక్తిని పెంచుతుంది. వాపును తగ్గిస్తుంది. ఇస్కీమిక్ గుండె జబ్బులు, క్యాన్సర్‌ను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది.
గర్భిణీలు స్త్రీలు బీట్ రూట్ తీసుకోవడం చాలా అవసరం. ఇందులో ఉండే ఫొలేట్, విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీని వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.