పండ్లను క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం స్నాక్స్ రూపంలో పండ్లు తీసుకుంటే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
పండ్లలలో క్యాలరీలతో పాటు కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ పండ్లను తీసుకోవం వల్ల గుండెపోటు, పక్షవాతం నివారణంలో పండ్లు మంచి పాత్ర పోషిస్తాయి.
డయాబెటిస్ సమస్య రావొద్దంటే కూడా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ ఊబకాయంతో పాటు, డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తాయి.
మల బద్ధకంతో బాధపడేవారు కూడా కచ్చితంగా ప్రతీ రోజూ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఉండే పండ్ల వల్ల మల బద్ధకం దూరమవుతుంది.
బీపీ బారిన పడకుండా ఉండాలంటే పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండే.. అరటి, తర్బూజా, నారింజ వంటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కూడా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్ల వల్ల శరీరం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
ఎక్కువ కాలం యంగ్‌గా ఉండాలనుకునే వారు కూడా కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ యాంటీ ఏజింగ్ ఫుడ్‌గా ఉపయోగపడతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.