వింటర్ టూర్ ప్లాన్ చేస్తే.. ఈ ప్లేసులు అస్సలు మిస్ అవ్వద్దు.. 

Prudvi Battula 

Images: Pinterest

19 November 2025

ఆంధ్రప్రదేశ్‎లోని అరకు, లంబసింగి, వంజంగి, మారేడుమిల్లి వంటి ప్రదేశాలు శీతాకాలంలో సందర్శించడానికి బెస్ట్ ఆప్షన్.

ఆంధ్రప్రదేశ్‎

శీతాకాలంలో కేరళ ప్రకృతి చాల ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ కోవాలం బీచ్, మున్నార్, వయనాడ్, అలెప్పి ఇలా అనేక ప్రదేశాలను చూడవచ్చు.

కేరళ

మీరు ఫ్రాన్స్‌కు వెళ్లలేనప్పుడు ఫ్రెంచ్ కాలనీ అయిన పాండిచ్చేరి వెళ్లవచ్చు. శీతాకాలంలో ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

పాండిచ్చేరి

చలికాలంలో నాసిక్ ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఈ ప్రదేశం మంత్రముగ్ధులను చేస్తుంది. కచ్చితంగా సందర్సించాలి.

నాసిక్

వింటర్ టూర్ కోసం రాజస్థాన్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ జైపూర్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్ వంటివి చూడవచ్చు.

రాజస్థాన్

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మనాలి, సిమ్లా, ధర్మశాల, మెక్‌లియోడ్‌గంజ్‌ వంటి హిల్ స్టేషన్‌లు ప్రసిద్ధ శీతాకాల ప్రదేశాలలో ఒకటి.

హిమాచల్ ప్రదేశ్‌

ఔలి శీతాకాలంలో సందర్శనకి ఉత్తమ ప్రదేశాలలో ఒకటి. స్కీయింగ్‌తో పాటు, చైర్ కార్ రైడ్‌లు ట్రెక్కింగ్ అంటూ హ్యాపీగా గడపవచ్చు.

ఔలి

లక్షద్వీప్‌లోని తెల్లటి ఇసుక బీచ్‌లలో అద్భుతమైన అందమైన పగడపు దిబ్బలతో ఉత్తమ శీతాకాలపు గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.

లక్షద్వీప్‌