వారు కాకరకాయ తిన్నారంటే.. అంతే సంగతులు.. లైఫ్ రిస్క్..
Prudvi Battula
Images: Pinterest
10 November 2025
ఎన్నిరకాల కురగాయలున్నా కాకరకాయ టెస్ట్ వెరీ వెరీ స్పెషల్. చేదు రుచి ఉన్న ఈ కాకరకాయ తింటే ఆరోగ్యానికి మేలు.
కాకరకాయ
కాకరకాయ తింటే ఎన్నో రోగాలు నయం అవుతాయి. అయితే చాలామందికి మేలు చేసే ఈ కాకరకాయ కొంతమందికి హాని చేస్తుంది.
కొంతమందికి హాని
షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ బెస్ట్ మెడిసిన్. దీన్ని తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బెస్ట్ మెడిసిన్
ఇది షుగర్‌కే కాదు మలబద్ధకం, గుండె, బరువు తగ్గడం , కొలెస్ట్రాల్ నివారణకు కూడా మేలు చేస్తుంది. అయితే ఇది కొంతమంది ఆరోగ్యానికి హానికరం.
జబ్బులకు నివారణ
ఎవరైనా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నవారు కాకర కాయను తినడం వలన ఆరోగ్యానికి హానిని కలిగించే అవకాశం ఉంది. లివర్లో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది.
కాలేయ సమస్యలు
గర్భిణీ స్త్రీలు కూడా కాకర కాయను తిన కూడదు. ఎందుకంటే కాకర గింజల్లో ఉండే మెమోర్చరిన్ పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.
గర్భిణులకు హాని
కొన్ని సందర్భాల్లో కాకర కాయ పిల్లలకు విరేచనాలు, వాంతుల బారిన పడేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎక్కువగా కాకర కాయను పెట్టవద్దు.
పిల్లలకు అనారోగ్యం
మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తినకూడదు. షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. దీంతో హిమోలిటిక్ అనీమియా వచ్చే ప్రమాదం ఉంది.