రైలు టిక్కెట్టు పోయినా, చిరిగినా మరొకటి పొందవచ్చా.?
TV9 Telugu
19 October 2024
భారత రైల్వే ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతున్నాయి. దీని ద్వారా కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.
దేశంలో రైలు ప్రయాణం చేయడానికి టిక్కెట్టు తప్పనిసరి. అయితే మీ టికెట్ పోయినా లేదా చిరిగినా? ప్రయాణం చేయలేరు.
మీరు రైలులో ప్రయాణిస్తుంటే, మీ టికెట్ పోయినట్లయితే, మీరు ఈ విషయంలో రైలులోని TTEకి ముందే తెలియజేయాలి.
పోగొట్టుకున్న టిక్కెట్‌కు బదులుగా TTE మీకు డూప్లికేట్ టిక్కెట్‌ను జారీ చేస్తారు. ఈ టిక్కెట్టు ఉచితంగా ఇవ్వరు.
భారతీయ రైల్వేకు చెల్లించిన తర్వాత ప్రయాణీకుడు నకిలీ టిక్కెట్‌ను పొందుతారు. వివిధ వర్గాల రైళ్లకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.
స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ టికెట్ కోసం డూప్లికేట్ టికెట్ కోసం రూ.50 చెల్లించాలి. ఏదైనా ఫస్ట్ క్లాస్ ఉంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ దగ్గర ఉన్న ట్రైన్ టికెట్ చిరిగిపోతే, ప్రయాణ ధరలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ పొందవచ్చు.
ఇది తెలుసుకున్నారు కదా ఇంకా మీ ట్రైన్ టికెట్ పోయిన, చిరిగినా అస్సలు కంగారు పడకండి వెంటనే అధికారులకు తెలపండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి