పియర్స్‎ మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలకు రక్త కన్నీరే..

Prudvi Battula 

Images: Pinterest

13 November 2025

పియర్స్‎లో ఫోలేట్, ప్రొవిటమిన్ ఎ, నియాసిన్‌లు లభిస్తాయి. ఇవి శక్తి ఉత్పత్తికి ముఖ్యమైనవి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, గాయం నయం కూడా సహాయపడుతుంది.

చర్మానికి మేలు

బేరి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రేగు క్రమబద్ధతను నిర్వహించడానికి పడుతుంది.

జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం

వీటిలోని ఫ్లేవనాయిడ్, యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

వాపు తగ్గుతుంది

పియర్స్ క్యాన్సర్ నిరోధకసమ్మేళనాలను కలిగి ఉంటాయి. వాటి ఆంథోసైనిన్, క్లోరోజెనిక్ ఆమ్లం కంటెంట్ క్యాన్సర్ నుండి రక్షించడానికి ఉపయోగపడతాయి.

క్యాన్సర్ నివారిణి

రోజూ ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ సమస్యను తగ్గించవచ్చు.

చక్కెర స్థాయిలు నియంత్రణ

పియర్స్‎లోని ప్రోసైనిడిన్ యాంటీఆక్సిడెంట్లు గుండె కణజాలంలో దృఢత్వాన్ని తగ్గిస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది

బేరి పండ్లలో తక్కువ కేలరీలుగా, ఎక్కువ నీరు, అధిక ఫైబర్ ఉన్నందున బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి.

బరువు తగ్గుతారు

ఆకుపచ్చని చర్మం కలిగిన బేరి పండ్లలో లుటీన్, జియాక్సంతిన్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. మీ దృష్టిని పదునుగా ఉంచడానికి ఇవి అవసరం.

కంటికి మంచిది