ఎర్ర మిర్చి పొడిలో కల్తీని గుర్తించండిలా..
TV9 Telugu
13 May 2024
రెడ్ చిల్లీ పౌడర్ (మిర్చి) అనేది మన వంటగదిలో ఒక ముఖ్యమైన మసాలా దినుసు. అది లేకుండా రుచికరమైన వంటకాలను అస్సలు ఊహించలేం.
తాతలు, ముత్తాతల కాలంలో ఎర్ర మిరపకాయలను కొనుగులు చేసి రోలులో మెత్తగా దంచి.. పొడిగా తయారు చేసి వాడేవారు.
అయితే ప్రస్తుతకాలంలో సమయాభావం వల్ల మార్కెట్ నుంచే ఎర్రమిర్చి కారం కొనుగోలు చేసి తెచ్చుకోవడం మొదలుపెట్టారు.
భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) కల్తీ ఎర్ర మిర్చి పౌడర్‌ను గుర్తించడానికి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంది.
నకిలీ మసాలాల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే నకిలీ ఎర్ర మిరప పొడిని గుర్తించడానికి సులభమైన మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.
దీని కోసం మీరు ఒక గ్లాసు నీటిని తీసుకోండి. తర్వాత దానిలో 1 టీస్పూన్ ఎర్ర మిరప పొడిని కలపండి. నీటి ద్వారా మిర్చిలో అవశేషాలను పరీక్షించండి.
చేతులకు రాసుకుని చర్మం గరుకుగా అనిపిస్తే మీరు వాడుతున్న ప్యాకెట్ కారంలో ఇటుక పొడి కలిపినట్లు అర్థం చేసుకోండి.
ఈ మిర్చి పౌడర్ మీ చేతుల్లో సబ్బులాగా స్మూత్‌గా అనిపిస్తే అందులో సబ్బు భాగాలు మిక్స్ అయ్యాయని అర్థం చేసుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి