"హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్" పేరుతో రెండు రోజుల టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం.
ఈ టూర్లో భాగంగా రెండు రోజులు పాటు యాదాద్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు చుట్టి రావచ్చు.
మొదటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ IRO ఆఫీసు నుంచి బస్సులో బయల్దేరి 8 గంటలకు భువనగిరి కోటను చూస్తారు.
తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 9 గంటలకు యాదగిరిగుట్ట చేరుకొని 9:45 గంటలకు దర్శనం పూర్తిచేసుకొని అక్కడి నుంచి బయల్దేరుతారు.
తర్వాత11:00 నుంచి 11:30 వరకు జైన్ దేవాలయం దర్శించి మధ్యాహ్నం 12 గంటలకు పెంబర్తి హస్తకళ షాపింగ్ చేసుకోవచ్చు.
1:30 గంటలకు హన్మకొండ హరిత కాకతీయ హోటల్ చెక్-ఇన్ తర్వాత భోజనం చేసి రెస్ట్ తీసుకొని 4:00 నుంచి 8:30 వరకు.. వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం దర్శించుకుంటారు.
వీటితో పాటు వరంగల్ ఫోర్ట్ సౌండ్ & లైట్ షో చూసి రాత్రి 9 గంటలకు హోటల్‌కి చేరుకొని డిన్నర్ చేసి అక్కడే స్టే చేస్తారు.
రెండో రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 8 గంటలకు బయల్దేరి రామప్ప టెంపుల్కు వెళ్లి 10:00 నుంచి 1:00 మధ్యలో రామప్ప ఆలయ సందర్శన, బోటింగ్, భోజనం ఉంటుంది.
అనంతరం లక్నవరం చేరుకొని 2:00 నుంచ 3:00 మధ్య బోటింగ్, లక్నవరం సందర్శన పూర్తి చేసి అక్కడి నుంచి రిటర్న్ అవుతారు.
సాయంత్రం 5 గంటలకు హన్మకొండలోని హరిత హోటల్‌లో టీ, స్నాక్స్ బ్రేక్ తీసుకొని 5:30 గంటలకు బయల్దేరి రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. పెద్దలకు.. రూ.3,449, పిల్లలకు రూ.2,759 రూపాయలుగా ఫిక్స్ చేసింది తెలంగాణ టూరిజం. ఈ టూర్ ఏసీ మినీ కోచ్ బస్సులో ఉంటుంది.