జారుడు బల్ల జలపాతం.. అరకు పర్యటనలో ఇది సూపర్

TV9 Telugu

03 February 2025

ఆంధ్రప్రదేశ్‎లోని ఆరకు అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక్కడ ప్రకృతి అందాలు, పాలధారను తలపించే జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

ఈరోజు ఆరుకు లోయల్లో సుందరమైన జలపాతంగా పేరు పొందిన ఆహ్లాదకరమైన చాపరాయి గురించి మనం తెలుసుకుందాం రండి..

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకుకి 15 కి.మీ దూరంలో ఉంది ఆహ్లదకరమైన చాపరాయి జలపాతం.

ఆరకు వెళ్లారంటే ఈ జలపాతానికి తప్పకుండా వెళ్ళాలి. ఇది మంచి పిక్నిక్ స్పాట్. హాయిగా కూర్చొని భోజనం చేయవచ్చు.

ఈ జలపాతంలో స్నానం చేస్తే ఏంటో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏటవాలుగా ఉన్న రాయిపై దీనిపై జారుతూ హాయిగా స్నానం చెయ్యవచ్చు.

ఇది చూసిన ప్రతి పర్యాటకుడికి ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, సహజ శిలలపై జాలువారుతున్న నీటి ప్రవాహం కన్నలవిందుగా ఉంటుంది.

అయితే ఈ జలపాతంలో స్నానం చేసినప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ చాపరాయి జలపాతం చాలా ప్రమాదకరమైనది.

నీటి ప్రవాహం తక్కువ ఉన్నపుడు మాత్రమే ఇక్కడ స్నానం చేయడానికి అనుమతిని ఇస్తారు. వర్షకాలంలో అస్సలు నీటిలోకి దిగనివ్వరు.