వేడుక ఏదైనా ముత్తైదువులను ఇంటికి పిలిచి తమలపాకు అందించడం మన సంప్రదాయం. ఇవి కేవలం సంప్రదాయాన్నే కాదు.. ఆరోగ్యాన్నీ అందాన్నీ కూడా సంరక్షిస్తాయట
ఇందులో యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పీహెచ్ స్థాయులను నిలకడగా ఉంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్ధకం దూరమవుతుంది
అలాగే తమలపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి1, బి2, సిలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కురుల ఎదుగుదలకు సాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు
జుట్టు పొడిబారి చిట్లిపోతుంటే... కొన్ని తమల పాకులను ముద్దలా చేసి రెండు స్పూన్ల తేనె కలిపి జుట్టుకి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి
కాలుష్యం, పోషకాల లేమి వంటి వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు ఐదు తమలపాకులను ముద్ద చేసి అందులో రెండు స్పూన్ల కొబ్బరినూనె, చెంచా ఆముదం కలపాలి
ఈ మిశ్రమాన్ని మాడు నుంచి చివర్ల వరకు రాసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
తమలపాకులు, కొన్ని మందార పూలు, కరివేపాకు, తులసి ఆకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకుని, అందులో రెండు చెంచాల కొబ్బరినూనె కలిపి వారానికి 2 సార్లు జుట్టుకు పట్టిస్తే వెంట్రుకలు చిట్లవు