నాన్‌స్టిక్ పాత్రలపై వంట చేయడం సులువు. వండిన తర్వాత వాటిని శుభ్రం చేయడం కూడా ఈజీనే. అందుకే చాలామంది మహిళలు నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువగా వాడుతుంటారు
TV9 Telugu
మామూలు పాత్రల్లా వీటిని ఇష్టం వచ్చినట్లు వాడితే మాత్రం త్వరగా పాడైపోతాయంటున్నారు నిపుణులు. వాటిపై ఉండే టెప్లాన్ కోటింగ్ పోయి పనికి రాకుండా పోతాయట
TV9 Telugu
అందుకే నాన్‌స్టిక్ పాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అప్పుడే నాన్‌స్టిక్ పాత్రలు ఎక్కువ కాలం మన్నుతాయి. నాన్‌స్టిక్ పాత్రలను సన్నటి మంటపై మాత్రమే ఉంచాలి
TV9 Telugu
ఎక్కువ మంటపై పెడితే ఆ వేడికి నాన్‌స్టిక్ పాత్రలపై ఉన్న టెప్లాన్ కోటింగ్ పోతుంది. ఎంత తక్కువ మంటపై వీటిని ఉపయోగిస్తే అంత మంచిది. నాన్‌స్టిక్ పాత్రలను డైరెక్ట్ స్టవ్‌పై పెట్టి అలాగే ఉంచొద్దు. స్టవ్‌పై పెట్టే ముందు లేదా పెట్టిన వెంటనే కొద్దిగా నూనె పోయాలి
TV9 Telugu
ప్రతి వంటకానికి నాన్‌స్టిక్ పాత్రలను ఉపయోగించకూడదు. ఏవైనా అతుక్కుపోయే కూరలు లేదా ఫ్రై కర్రీలు చేసినప్పుడే వీటిని వాడాలి. తద్వారా ఎక్కువ కాలం మన్నుతాయి
TV9 Telugu
కూర వండేటప్పుడు కలపడానికి ప్లాస్టిక్, చెక్క గరిటెలను మాత్రమే ఉపయోగించాలి. ఐరన్, స్టీల్, ఇత్తడి, సిల్వర్ వంటి గరిటెలను వాడకూడదు. వీటిని వాడితే పాత్రలపై గీతలు పడే అవకాశం ఉంది
TV9 Telugu
నాన్‌స్టిక్ పాత్రలను తోమేటప్పుడు గరుకుగా ఉండే పీచు ఉపయోగించకూడదు. అలాగే జిడ్డు మరకలు పోవాలని గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల గిన్నెలపై కోటింగ్ పోయే అవకాశం ఉంది
TV9 Telugu
నాన్‌స్టిక్ పాత్రలను వంటింట్లోని సెల్ఫ్‌లు లేదా అల్మారాలో పెట్టినప్పుడు గీతలు పడే ప్రమాదం ఉంది. అందుకే వాటిని సెల్ఫ్‌లో కాకుండా, గిన్నెలు పెట్టుకునే స్టాండ్‌లో పెట్టుకోవాలి