07 September 2024
TV9 Telugu
Pic credit - Pexels
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే ఉల్లిపాయల్ని ఒలిచి పాడవేసే ఉల్లి తొక్కలు కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఉల్లి తొక్కలు ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి
ఉల్లి పాయలను ఉపయోగించిన తర్వాత వాటి తొక్కలను చెత్తబుట్టలో పడేస్తారు. లేదా మొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే దీన్ని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు.
విటమిన్ ఎ, సి సహా అనేక ఇతర పోషకాలు ఉల్లిపాయ తొక్కలలో కనిపిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి.
జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉంటే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించవచ్చు. తొక్కలను నీటిలో మరిగించి, చల్లారనివ్వడం ద్వారా మీరు హెయిర్ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు.
2 టీస్పూన్ల అలోవెరా జెల్ , 2 టీస్పూన్ల ఉల్లిపాయ తొక్కలను మిక్స్ చేసి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇది జుట్టుకు మెరుపును తీసుకురావడంలో సహాయకరంగా ఉంటుంది.
ఉల్లిపాయ తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి, దానికి రోజ్ వాటర్ కలిపి ముఖానికి 5 నుండి 10 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఉల్లిపాయ తొక్కల నుండి కంపోస్ట్ తయారు చేయవచ్చు. ఇది మొక్కలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించారు. ఈ ఎరువులు సిద్ధం చేయడానికి 30 రోజులు పట్టవచ్చు.
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. కనుక ఉల్లితొక్కతో టీ త్రాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చర్మం, జుట్టు లేదా టీ తాగడం కోసం ఉపయోగించే ముందు ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించాలి.