మీరూ ప్యూమిస్ స్టోన్ వాడుతున్నారా?

07 July 2024

TV9 Telugu

TV9 Telugu

చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగించడానికి క్లెన్సింగ్, స్క్రబింగ్ చేయడం సహజమే. వాటితో పాటు స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ కూడా ఉపయోగించాలంటున్నారు నిపుణులు

TV9 Telugu

అయితే ఈ ప్యూమిస్ స్టోన్ ఉపయోగించే ముందు ఆయా శరీర భాగాల్ని గోరువెచ్చటి నీళ్లలో కాసేపు ఉంచాలి. అలాగే ప్యూమిస్ స్టోన్‌ని కూడా నానబెట్టాలి. ఆపై ఈ రాయితో ఆ ప్రదేశంలో గుండ్రంగా, మృదువుగా, సున్నితంగా రుద్దుకోవాలి

TV9 Telugu

ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి చర్మం శుభ్రపరుచుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎందుకంటే గరుకుగా ఉండే ఈ రాయి వల్ల చర్మం తేమను కోల్పోయే అవకాశం ఉంటుంది

TV9 Telugu

ఫలితంగా చర్మం నిర్జీవంగా, పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ! ఈ సమస్య రాకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ తప్పనిసరి! కాళ్లతోపాటు చేతులు మృదువుగా మారాలన్నా, చేతి వేళ్లు, గోళ్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా మానిక్యూర్ చేయించుకోవాలి

TV9 Telugu

కేవలం పాదాలు, చేతులు, చర్మ సంరక్షణకే కాదు.. ప్యూమిస్ స్టోన్‌ని అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి కూడా ఉపయోగించచ్చు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి ఆ భాగాన్ని నీటితో తడిపి తర్వాత సబ్బు రాయాలి

TV9 Telugu

తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో ఆ ప్రాంతంలో నెమ్మదిగా రుద్దితే అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. తరచుగా ప్యూమిస్ స్టోన్‌ను ఉపయోగించడం వల్ల ఆయా భాగాల్లో వెంట్రుకలు పెరగడం కూడా తగ్గుతుంది

TV9 Telugu

గోరువెచ్చని నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. వీలైతే ఈ నీటిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్‌ని కలపండి. తద్వారా పాదాలు నీటిలో నాననివ్వాలి. మెత్తబడ్డాక ప్యూమిస్ స్టోన్‌తో మడమలను, అరికాళ్లను మృదువుగా మర్దన చేసుకోవాలి

TV9 Telugu

అయితే ప్యూమిస్ స్టోన్ వాడేటప్పుడు ఇతర శరీర భాగాల మాదిరిగా ముఖంపై ప్యూమిస్‌ స్టోన్‌ ఉపయోగించకూడదు. అలాగే పగిలిన చర్మంపై ప్యూమిస్ స్టోన్‌ని రుద్దకూడదు. ఒకరు వాడిన ప్యూమిస్ స్టోన్ ఇంకొకరు అస్సలు వాడకూడదు