ఇలా చేశారంటే కరివేపాకు 6 నెలలైనా పాడవదు..!

26 June 2024

TV9 Telugu

TV9 Telugu

కాలమేదైనా ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. అలాగని ఫ్రిజ్‌లో నిల్వ చేసినా 2, 3  రోజులకు మించి అవి తాజాగా ఉండవు. ఎండిపోవడమో.. కుళ్లిపోవడమో జరుగుతుంటుంది

TV9 Telugu

ఇలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్‌ చిట్కా బలేగా పనిచేస్తుంది. ఈ చిట్కాతో కరివేపాకును ఆరు నెలల పాటు తాజాగా నిల్వ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

ముందుగా ఆకుల్ని కాడ నుంచి వేరు చేసి.. కొన్ని కొన్ని ఆకుల్ని ఐస్క్యూబ్స్‌ ట్రేలో అమర్చింది. అవి మునిగేలా నీళ్లు నింపి.. మూత పెట్టి ట్రేను ఫ్రీజర్‌లో పెట్టాలి. అవి గడ్డకట్టాక.. వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే సరి

TV9 Telugu

వీటిని కావాలనుకున్నప్పుడు గోరువెచ్చటి నీటిలో వేస్తే ఐస్‌ కరిగిపోయి కరివేపాకులు మనం అమర్చినప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో.. అప్పుడు కూడా అంతే తాజాగా ఉంటాయి

TV9 Telugu

ఇలా కరివేపాకునే కాదు.. ఇతర ఆకుకూరల్నీ ఇదే తరహాలో నిల్వ చేసుకోవచ్చు. ఇదేవిధంగా ఆకుకూరలతో పాటు కాయగూరలు, పండ్లనూ ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుకోవాలంటే ఈ సింపుల్‌ చిట్కాల్ని పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు

TV9 Telugu

ఐస్‌ ట్రేలో సగం వరకు కరిగించిన బటర్‌/నెయ్యి పోసి.. అందులో తరిగిన కొత్తిమీర వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు రోజుల తర్వాత ఆ క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లలోకి మార్చి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. కూరలు చేసేటప్పుడు ఈ క్యూబ్స్‌ని అందులో వేస్తే సరిపోతుంది

TV9 Telugu

ఆకుకూరలు ఎక్కువ రోజులపాటు తాజాగా ఉండాలంటే వాటిని కడిగి, ఆరబెట్టి, సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఐస్ ట్రేలలో ముప్పావు వంతు నింపి, ఆకులు మునిగే వరకు నీరు పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి 

TV9 Telugu

పాలకూర, గుమ్మడికాయ, క్యారట్ వంటి వాటిని కూడా ప్యూరీ చేసుకుని రెండు రోజుల పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. అవి గట్టిపడిన తర్వాత జిప్‌లాక్ కవర్లో భద్రపరచుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మరిగే నీటిలో ఈ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది